డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు
యాదాద్రి భువనగిరి జిల్లా: డబ్బుల కోసం వరుసకు అమ్మమ్మ అయిన 70 ఏళ్ల వృద్ధురాలిని మనవడు హత్య చేసిన ఘటన చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్‌లో వెలుగుచూసింది.
ఈ నెల 27న మంటిపల్లి యాదమ్మ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి బంధువైన *మంటిపల్లి రాజు (31)**పై అనుమానం రావడంతో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో రాజు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. డబ్బుల కోసమే యాదమ్మను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని పరారైనట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది...®✓
Tags
cinima news
