బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యంతోనే... గొడ్డలిపార్టీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు : ప్రత్తిపాటి




బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యంతోనే... గొడ్డలిపార్టీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు :  ప్రత్తిపాటి


• ఆవిర్భావం నుంచి బీసీలు టీడీపీ పక్షాన నిలవడాన్ని జగన్ భరించలేకపోతున్నాడు.

• 16,800 స్థానిక సంస్థల పదవుల్ని బీసీలకు దక్కకుండా చేసిన బీసీ ద్రోహి జగన్.

• జగన్ అడ్డుకోకుంటే, బీసీలకు ప్రభుత్వ రిజర్వేషన్లే అమలయ్యేవి.

• జీవోల ద్వారా కూటమి ప్రభుత్వం బీసీలకు సముచిత రాజకీయ ప్రాధాన్యం కల్పించేది.

• ఐదేళ్లు బీసీల్ని అన్నివిధాల అణచివేసిన జగన్.. వైసీపీనేతలు, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

• నియోజకవర్గ బీసీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి.


బలహీన వర్గాల రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు అతిపెద్ద అడ్డంకి, అవరోధం జగన్..వైసీపీయేనని, బీసీల్లో చైతన్యం.. ప్రశ్నించేతత్వం పెరిగినప్పుడే గొడ్డలిపార్టీ రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.


స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ బి.సి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దిబోయిన శివ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి బీసీల సమీక్ష సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పార్టీ పరంగా అమలుచేయనున్న 34శాతం బీసీ రిజర్వేషన్లను స్వాగతిస్తూ.. ప్రత్తిపాటి, నియోజకవర్గ బీసీ నేతలకు స్వయంగా స్వీట్లు తినిపించారు. అనంతరం ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు.


*34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన*

చంద్రబాబు ప్రకటించిన బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి మరీ బలహీనవర్గాల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నాడని ప్రత్తిపాటి ఆక్షేపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు, ఆపార్టీకే అండగా నిలుస్తున్నారన్న భావన జగన్ మనసులో నాటుకుపోయిందని, ఆ దురుద్దేశంతోనే బలహీన వర్గాల్ని అన్ని విధాలా అణచివేస్తున్నాడన్నారు. 2019-24 మధ్య రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన 16,800కు పైగా స్థానిక సంస్థల పదవుల్ని జగన్ వారికి దూరం చేశాడని ప్రత్తిపాటి తెలిపారు. తమకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, మోసంపై ప్రశ్నించిన బీసీలను హతమార్చడానికి కూడా జగన్ వెనుకాడలేదన్నారు.  జగన్.. వైసీపీ అడ్డుకోకుంటే, 34 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వపరంగానే అమలయ్యేవని, జీవోల ద్వారా కూటమి సర్కారు బీసీలకు న్యాయం చేసేదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.


*40 రోజుల ఎన్నికల దీక్షలో.. విజయమే మన లక్ష్యం.*

అన్నిరకాలుగా బీసీల్ని బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, బలహీన వర్గాల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకం టీడీపీ అధినేతకు ఉందని ప్రత్తిపాటి చెప్పారు. 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ప్రకటించాలన్నఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడే అవకాశముందన్నారు. 14న ఎన్నికల షెడ్యూల్, 15న నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్న ప్రత్తిపాటి. పట్టణంలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని, ఆ దిశగా మూడుపార్టీల శ్రేణులు క్షేత్రస్థాయి నుంచే పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలతో పాటు.. పంచాయతీలు, మండలాలు, జడ్పీటీసీల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, రెండున్నరేళ్లలోచేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 40 రోజుల ఎన్నికల దీక్ష తీసుకొని, విజయమే లక్ష్యంగా కూటమిశ్రేణులు నిబద్ధత, పట్టుదల, అంకితభావంతో పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.


సమీక్ష సమావేశంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్a మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, కొత్త కోటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బి.సి నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, ఆర్టీసీ కంచర్ల శ్రీనివాసరావు, తుపాకుల అప్పారావు, అవ్వారు లక్ష్మణ్, బ్రహ్మం , ఒంటిపల్లి వెంకట, అద్దంకి అనితా భాయి, నిమ్మకాయల ప్రసాద్, రంగనాథుల నాగేశ్వరరావు, రామాంజనేయులు,     టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది