ఇదే నా డిమాండ్: కవిత
TG:తనకంటూ ప్రత్యేకంగా అజెండా లేదని, పార్టీని కాపాడుకోవడమే తన అజెండా అని MLC కవిత స్పష్టం చేశారు. KCR తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించబోనని మంచిర్యాలలో మీడియాతో చిట్చాట్లో పునరుద్ఘాటించారు. BJP వైపు చూడొద్దని BRSను కోరారు. BJPతో పొత్తులో ఉన్న పార్టీలు బాగుపడలేదని, అందులో విలీనాన్ని ఒప్పుకోనని తేల్చిచెప్పారు. ఆవేదన భరించలేక KCRకు లేఖ రాశానని, దాన్ని బయట పెట్టినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Tags
Telangana News
