అల్లూరు గ్రామంలో 53 మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో శనివారం నాడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద అర్హులైన 53 మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు పొగలేని వంట గదులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రజలకు నేరుగా ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లు అందుకున్న మహిళలు ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags
AP News