పేదల కోసం మెగాస్టార్ గొప్ప నిర్ణయం!
పేదవారికి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు Chiranjeevi తెలిపారు. ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
“ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను” అని అన్నారు.
ఇదే సమయంలో తమిళ హీరో Suriya నిర్వహిస్తున్న Agaram Foundation కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. “సూర్య గారు నన్నే ఇన్‌స్పిరేషన్ అంటారు… కానీ నిజానికి ఆయన చేస్తున్న సేవలు నాకు ప్రేరణ” అని మెగాస్టార్ పేర్కొన్నారు.
సమాజానికి ఉపయోగపడే ఇలాంటి నిర్ణయాలు మరెంతో మందికి స్ఫూర్తి కావాలి!
Tags
cinima news