ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు : ప్రత్తిపాటి

 



ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు : ప్రత్తిపాటి


• ప్రజలకు నాణ్యమైన వైద్య, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

• ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి.


విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం, సంబంధిత విభాగాల యంత్రాంగం ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, ప్రజలకు నాణ్యమైన, మేలైన విద్య, వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.


గురువారం సాయంత్రం ఆయన స్థానిక 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్,  వైద్యులు, పాలకవర్గ సభ్యులు, వైద్యేతర సిబ్బంది, ఏ.ఎన్.ఎమ్ లతో సమావేశమైన ప్రత్తిపాటి.. ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు.


చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధి నిధుల్ని సక్రమంగా వినియోగిస్తున్నామని, 100 పడకల ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలల్ని అభివృద్ధి చేయాలి.. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవల్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా అన్నిచర్యలు తీసుకుంటోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించినట్టుగానే, ప్రభుత్వాసుపత్రుల పనితీరు, వైద్యుల ప్రవర్తన, సౌకర్యాల కల్పన వంటి వాటిపై ర్యాంకులు, మార్గదర్శకాలు విడుదల చేస్తోందన్నారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో రూ.10కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవన్నీ పూర్తయితే ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన కొన్ని వైద్యపరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, సంబంధిత అధికారులతో మాట్లాడి.. వీలైనంత త్వరగా అవి సమకూరేలా చూస్తామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు.


*మేలైన వైద్య, విద్య ప్రజలకు అందితే సమస్యలు తీరినట్టే..*

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్ని మంత్రులు నారాలోకేశ్, సత్యకుమార్ యాదవ్ లు ఉత్తమమైన ప్రజాసేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారని, ప్రజలకు విద్య, వైద్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రత్తిపాటి వివరించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన, ప్రజలకు మేలైన వైద్యసేవలు అందితే చాలా వరకు సమస్యలు తీరిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది